AP Schools: ఏపీలో స్కూళ్లకు సెలవులు లేవు.. మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత..

AP Schools: ఏపీలో స్కూళ్లకు సెలవులు లేవు.. మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత..
AP Schools: ఏపీలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపు ఆలోచనే లేదని తేల్చిచెప్పారు విద్యామంత్రి ఆదిమూలపు సురేష్.

AP Schools: ఏపీలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపు ఆలోచనే లేదని తేల్చిచెప్పారు విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా వ్యాప్తితో తెలంగాణలో విద్యాసంస్థలకు ఈనెల 30వరకు సెలవులు పొడిగించారు. యూనివర్సిటీల్లోని అన్ని పరీక్షలు రద్దు చేశారు. ఈనేపథ్యంలో ఏపీలోనూ విద్యాసంస్థ సెలవులు పొడిగిస్తారా అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని ఆయన సమాధానమిచ్చారు.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇవాళ కూడా 4వేలకు పైగా కేసులు వచ్చాయి. వైరస్ విజృంభణ నేపథ్యంలో మంత్రి ప్రకటన.. విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తోంది. పిల్లలకు వ్యాక్సినేషన్ కాకపోవడంతో పేరెంట్స్ లో ఆందోళన కనిపిస్తోంది. దీంతో స్కూళ్లకు పంపించాలా లేదా అనేది తేల్చుకోలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story