ANITHA: జత్వాని కేసుపై హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

ANITHA: జత్వాని కేసుపై హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
X
ఎవరినీ వదిలేది లేదన్న అనిత.... మరికొందరు పోలీసులపై చర్యలు ఉంటాయని స్పష్టీకరణ

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని అనిత వెల్లడించారు. ఈ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని మంత్రి వెల్లడించారు. విచారణ తర్వాత కొంతమంది పోలీసులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ముంబై నటి కేసును చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెండ్‌

హీరోయిన్ జిత్వానీ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌లో అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొచ్చిన విషయం విదితమే.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. విద్యాసాగర్ కు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం విదితమే.

ఇంతకుముందే హోంమంత్రితో భేటీ

ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. హోం మంత్రి అనితతో గతంలో జత్వానీ సమావేశం అయ్యారు . తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని జత్వానీ కుటుంబం కోరింది. గతంలో పోలీసులు తన విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోం మంత్రికి వివరించానని జత్వాని తెలిపారు. పోలీసులు తన విషయంలో.. తన ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోంది. నాపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకూడదు.. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరాను. నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతున్నాం అని పేర్కొన్నారు

Tags

Next Story