New Delhi : ఏపీ విభజన సమస్యపై కేంద్ర హోంశాఖ ఫోకస్..

New Delhi : ఉమ్మడి ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజనపై హోంశాఖ సమావేశమైంది. హెడ్ క్వార్టర్స్ విభజన, దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్‌ఆస్తుల కేసులు... కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో న్యాయశాఖతో సంప్రందించిన త్వరగా పరిష్కరించాలని ఆదేశింది. మరోవైపు... ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేసు కోర్టులో ఉన్నందున అధికారులు పరిశీలించాలని హోంశాఖ సెక్రటరీ ఆదేశించారు.
అటు... సింగరేణి కాలరీస్ లిమిటెడ్ 51శాతం వాటా పూర్తిగా తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తోంది. దీంతో సింగరేణి వాటను పరిశీలించాలని హోంశాఖ ఉన్నతాధికారులకు..... కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆదేశించింది. ఇక... వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల, గిరిజన వర్శిటీ ఏర్పాటు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com