HPV VACCINE: మహిళకు వరం - హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్

HPV VACCINE: మహిళకు వరం - హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్
X
దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్న కేంద్రం... ఏపీలో 3.45 లక్షలమంది బాలికలకు వ్యాక్సిన్‌.. తెలంగాణలోనూ ఆరంభమైన వ్యాక్సిన డ్రైవ్...

దే­శం­లో మహి­ళల ఆరో­గ్య రక్ష­ణ­కు ఒక కీలక ముం­ద­డు­గు పడ­బో­తోం­ది. గర్భా­శయ ము­ఖ­ద్వార క్యా­న్స­ర్‌ (సర్వై­క­ల్ క్యా­న్స­ర్) వంటి ప్రా­ణాం­తక వ్యా­ధి­ని ముం­దు­గా­నే అరి­క­ట్టే ది­శ­గా కేం­ద్ర ప్ర­భు­త్వం చా­రి­త్రా­త్మక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. 14 ఏళ్లు నిం­డిన బా­లి­క­ల­కు హ్యూ­మ­న్ పా­పి­లో­మా వై­ర­స్ (HPV) వ్యా­క్సి­న్‌­ను దే­శ­వ్యా­ప్తం­గా ఉచి­తం­గా పం­పి­ణీ చే­య­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చిం­ది. ఈ కా­ర్య­క్ర­మా­న్ని ఈ నెల 28న కేం­ద్ర ఆరో­గ్య శాఖ ప్రా­రం­భిం­చ­నుం­ది. ప్ర­పంచ ఆరో­గ్య సం­స్థ సి­ఫా­ర్సుల మే­ర­కు చే­ప­డు­తు­న్న ఈ టీకా కా­ర్య­క్ర­మం భా­ర­త­దే­శం­లో క్యా­న్స­ర్ ని­యం­త్రణ వ్యూ­హం­లో కీలక మై­లు­రా­యి­గా భా­వి­స్తు­న్నా­రు.

ఏపీలో విస్తృత ఏర్పాట్లు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో సు­మా­రు 3.45 లక్ష­ల­మం­ది 14 ఏళ్ల బా­లి­క­ల­కు ఈ టీకా ఇవ్వా­ల్సి ఉం­టుం­ద­ని రా­ష్ట్ర వై­ద్య, ఆరో­గ్య­శాఖ అం­చ­నా వే­సిం­ది. గ్రామ/వా­ర్డు సచి­వా­ల­యాల శాఖ సమీ­క­రిం­చిన సమా­చా­రం ప్ర­కా­రం కర్నూ­లు జి­ల్లా­లో అత్య­ధి­కం­గా 23,957 మంది బా­లి­క­లు ఉం­డ­గా, పో­ల­వ­రం జి­ల్లా­లో అత్య­ల్పం­గా 2,777 మంది ఉన్నా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 1,683 ప్రా­థ­మిక ఆరో­గ్య కేం­ద్రా­ల్లో వ్యా­క్సి­న్ పం­పి­ణీ చే­ప­ట్ట­ను­న్నా­రు. ఇం­దు­కో­సం వై­ద్య సి­బ్బం­ది­కి ఇప్ప­టి­కే ప్ర­త్యేక శి­క్షణ ఇచ్చా­రు. ప్ర­తి బా­లి­క­కు 0.5 ఎం­ఎ­ల్ మో­తా­దు­లో ఇం­జ­క్ష­న్ రూ­పం­లో టీకా ఇస్తా­రు. సు­మా­రు మూడు నెలల పాటు ఈ వ్యా­క్సి­నే­ష­న్ డ్రై­వ్ కొ­న­సా­గు­తుం­ది. తొలి వి­డ­త­గా కేం­ద్రం నుం­చి 1,90,890 డో­సుల వ్యా­క్సి­న్ వయ­ల్స్ రా­ష్ట్రా­ని­కి చే­రు­కు­న్నా­యి. వ్యా­క్సి­న్ ఇవ్వ­డా­ని­కి ముం­దు తల్లి­దం­డ్రు­ల్లో కనీ­సం ఒకరి లి­ఖి­త­పూ­ర్వక సమ్మ­తి తప్ప­ని­స­రి. ఉదయం 9 గంటల నుం­చి మధ్యా­హ్నం 2 గంటల మధ్య పీ­హె­చ్‌­సీ­ల్లో టీకా అం­దిం­చ­ను­న్నా­రు. వ్యా­క్సి­న్ పం­పి­ణీ వి­వ­రా­ల­ను ‘యూ­వి­న్’ డి­జి­ట­ల్ పో­ర్ట­ల్‌­లో నమో­దు చే­స్తా­రు. పై­లె­ట్‌ ప్రా­జె­క్టు­గా ఏపీ పలు జి­ల్లా­ల్లో స్క్రీ­నింగ్‌ కూడా చే­శా­రు. 18 ఏళ్లు పై­బ­డిన పౌ­రు­లం­ద­రి­కీ క్యా­న్స­ర్‌ స్క్రీ­నిం­గ్‌ చే­ప­ట్టేం­దు­కు వి­శాఖలోని హో­మీ­బా­బా క్యా­న్స­ర్‌ ఆస్ప­త్రితో ఎం­వో­యూ కు­దు­ర్చు­కు­ని వై­ఎ­స్‌ జగ­న్‌ ప్ర­భు­త్వం­లో­నే గ్రా­మా­ల్లో వై­ద్య­సే­వ­లు అం­దిం­చే కమ్యూ­ని­టీ హె­ల్త్‌ ఆఫీ­స­ర్లు, వై­ద్యు­ల­కు శి­క్ష­ణ­ని­చ్చా­రు. సా­మూహిక క్యా­న్స­ర్‌ స్క్రీ­నిం­గ్‌ ప్రా­రం­భిం­చ­డా­ని­కి స­ర్వం సన్న­ద్ధం చే­సిన సమ­యం­లో­నే సా­ర్వ­త్రిక ఎన్ని­కల కో­డ్‌ అమ­లు­లో­కి రా­వ­డం­తో స్క్రీ­నిం­గ్‌ వా­యి­దా పడిం­ది. ఎన్ని­కల తర్వాత వచ్చిన చం­ద్ర­బా­బు ప్ర­భు­త్వం క­మ్యూనికబుల్, నా­న్‌ కమ్యూ­ని­క­బు­ల్‌ డి­సీ­జె­స్‌ (సీడీ–ఎన్‌­సీ­డీ–3.0) సర్వే­లో భా­గం­గా క్యా­న్స­ర్‌ స్క్రీ­నిం­గ్‌ అంటూ హడా­వు­డి చే­సిం­ది.

హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎందుకు కీలకం?

హ్యూ­మ­న్ పా­పి­లో­మా వై­ర­స్ (HPV) అనే­ది గర్భా­శయ ము­ఖ­ద్వార క్యా­న్స­ర్‌­కు ప్ర­ధాన కా­ర­ణం. సు­మా­రు 85-90 శాతం సర్వై­క­ల్ క్యా­న్స­ర్ కే­సు­లు హె­చ్‌­పీ­వీ కా­ర­ణం­గా­నే వస్తా­య­ని వై­ద్య ని­పు­ణు­లు చె­బు­తు­న్నా­రు. ము­ఖ్యం­గా హె­చ్‌­పీ­వీ టైప్ 16, 18 అత్యంత ప్ర­మా­ద­క­ర­మై­న­వి. టైప్ 6, 11 కూడా ఇతర ఆరో­గ్య సమ­స్య­ల­కు కా­ర­ణ­మ­వు­తా­యి. ‘గా­ర్డా­సి­ల్-4’ అనే వ్యా­క్సి­న్ ఈ నా­లు­గు రకాల వై­ర­స్‌ల నుం­చి రక్షణ కల్పి­స్తుం­ది. ప్ర­స్తు­తం మా­ర్కె­ట్‌­లో అం­దు­బా­టు­లో ఉన్న గా­ర్డా­సి­ల్-4 టీకా 15 ఏళ్ల లోపు బా­లి­క­ల­కు రెం­డు డో­సు­ల్లో ఇవ్వా­లి. ఒక్కో డోసు ధర సు­మా­రు రూ.3,927. 15 ఏళ్లు పై­బ­డిన వారు మూడు డో­సు­లు తీ­సు­కో­వా­లి. బయట ప్రై­వే­ట్ ఆస్ప­త్రు­ల్లో వే­యిం­చు­కుం­టే ఒక్కో మో­తా­దు­కు రూ.6,000 నుం­చి రూ.12,000 వరకు ఖర్చ­వు­తుం­ది. ఈ నే­ప­థ్యం­లో ప్ర­భు­త్వ ఉచిత టీకా కా­ర్య­క్ర­మం పేద, మధ్య­త­ర­గ­తి కు­టుం­బా­ల­కు పె­ద్ద ఊర­ట­ని­స్తుం­ది. ఈ వ్యా­క్సి­న్ 2006లో ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా అం­దు­బా­టు­లో­కి వచ్చిం­ది. ఇప్ప­టి­వ­ర­కు 50 కో­ట్ల­కు పైగా డో­సు­లు పం­పి­ణీ అయ్యా­యి. 160 దే­శా­ల్లో ఈ కా­ర్య­క్ర­మం అమ­లు­లో ఉం­డ­గా, వా­టి­లో 90 దే­శా­లు సిం­గి­ల్ డోసు వి­ధా­నా­న్ని అను­స­రి­స్తు­న్నా­యి. ప్ర­పంచ ఆరో­గ్య సం­స్థ (WHO) గర్భా­శయ క్యా­న్స­ర్ ని­ర్మూ­లన లక్ష్యం­తో హె­చ్‌­పీ­వీ వ్యా­క్సి­నే­ష­న్‌­ను కీలక వ్యూ­హం­గా సూ­చిం­చిం­ది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ భారం

ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ప్ర­తి సం­వ­త్స­రం సు­మా­రు 2 కో­ట్ల మంది క్యా­న్స­ర్ బా­రిన పడు­తు­న్నా­రు. వీ­రి­లో 15 లక్షల మంది భా­ర­తీ­యు­లే ఉన్న­ట్లు ప్ర­భు­త్వ గణాం­కా­లు వె­ల్ల­డి­స్తు­న్నా­యి. చైనా, అమె­రి­కా తర్వాత క్యా­న్స­ర్ బా­ధి­తుల సం­ఖ్య­లో భా­ర­త్ మూడో స్థా­నం­లో ఉంది. 2040 నా­టి­కి దే­శం­లో ఏటా 20 లక్షల క్యా­న్స­ర్ కే­సు­లు నమో­ద­య్యే అవ­కా­శం ఉం­ద­ని అం­చ­నా. తె­లం­గాణ ప్ర­భు­త్వం కూడా గర్భా­శయ క్యా­న్స­ర్ ని­వా­ర­ణ­పై ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టిం­ది. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా హె­చ్‌­పీ­వీ టీకా కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చేం­దు­కు ఏర్పా­ట్లు పూ­ర్తి చే­సిం­ది. సు­మా­రు 1,200 నుం­చి 1,500 మంది ఏఎ­న్‌­ఎం­ల­కు శి­క్షణ ఇచ్చిం­ది. 4.6 లక్షల డో­సుల వ్యా­క్సి­న్ కొ­ను­గో­లు చేసి, 14-15 ఏళ్ల బా­లి­క­ల­కు ఉచి­తం­గా అం­దిం­చ­నుం­ది.

Tags

Next Story