భార్య నగ్న వీడియోలు బయటపెట్టిన భర్త

భార్య నగ్న వీడియోలు బయటపెట్టిన భర్త

భార్య నగ్న వీడియోలు బయటపెట్టిన భర్తను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. భర్త వంశీకాంత్‌రెడ్డితో పాటు.. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు విచారించామని.. నగ్న వీడియోలు, ఫొటోలు తీసి వంశీకాంత్‌రెడ్డి వేధించాడని పోలీసులు తెలిపారు. తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని హింసించినట్లు విచారణలో తేలిందని గుంటూరు అర్బన్‌ ఎస్పీ తెలిపారు. పలు యాప్స్‌ ద్వారా వీడియోలు అమ్మే ప్రయత్నం చేసినట్లుగా గుర్తించారు. దిశా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు ఈ కేసుపై సాంకేతిక పరమైన సాక్ష్యాలు కూడా సేకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈజీ మనీ కోసమే వంశీకాంత్‌రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.

Tags

Next Story