Hyderabad : చాదర్‌ఘాట్ రోడ్డుపై 20 ఫీట్ల గొయ్యి

X
By - Subba Reddy |10 Feb 2023 3:15 PM IST
రోడ్డు కింద 20 ఫీట్ల వరకు ఏర్పడ్డ గుంత
హైదరాబాద్‌లో వాహనదారులకు పెను ముప్పు తప్పింది. చాదర్‌ఘాట్ ప్రధాన రహదారిపై హఠాత్తుగా గొయ్యి ఏర్పడింది. రోడ్డు కింద 20 ఫీట్ల వరకు గుంత ఏర్పడింది. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. గుంత చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే రోడ్లు కుంగుతుండటంతో నగరవాసులు ఆందోళనకు గురౌతున్నారు. రెండు నెలల క్రితమే గోషామాల్‌లో కుప్పకూలిన పెద్ద నాలా. రోడ్ల విషయంలో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com