I-PAC : ఏపీలో ఐ ప్యాక్‌ పాలన..?

I-PAC : ఏపీలో ఐ ప్యాక్‌ పాలన..?
ఐ ప్యాక్‌ టీం ఏది చెబితే అదే ఫాలో అవుతున్న జగన్‌ ప్రభుత్వం

ఏపీలో ప్రస్తుతం ఐ ప్యాక్‌ పాలన జరుగుతోందా? ఐ ప్యాక్‌ టీం ఏది చెబితే అది జగన్‌ ప్రభుత్వం పాటిస్తోందా? అధికారుల కంటే ఐ ప్యాక్‌ టీం చెప్పిన అంశాన్నే ప్రభుత్వం వేదంగా భావిస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. రోడ్లు మరమ్మతులు చేయాలంటూ ఐదు నెలల క్రితమే ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాలన్నింటిని పక్కన పెట్టింది జగన్‌ సర్కారు. కేవలం ఐ-ప్యాక్‌ సూచించిన రోడ్లకు మరమ్మత్తు పనులు చేపట్టేందుకు మొగ్గు చూపుతోంది.

ఐ-ప్యాక్‌ టీం చేసిన సర్వేల్లో రోడ్ల విషయంలో జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు గుర్తించింది. రోడ్లు వేయకపోతే ఓటమి తప్పదని భయపడిన ఐపాక్‌ టీం దీనిపై దృష్టిపెట్టాలని సూచించింది. అంతేకాదు తాము సూచించిన రోడ్లు వేయాలని లేక పోతే తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు వెళ్లేలోపు ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లు బాగు చేయాలని పేర్కొన్నట్లు సమాచారం.

ఐ-ప్యాక్‌ బృందం నియోజకవర్గానికి 5 రోడ్లను ఎంపిక చేసి వాటి పనులను తక్షణం చేపట్టాలని సూచించగా వాటిని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అనేక రోడ్లు అధ్వానంగా మారాయి. బైక్‌లపై కూడా రాకపోకలు సాగించలేని దుస్థితిలో ఉన్నాయి. వీటిలో 6,182 కి.మీ.లను వెంటనే పునరుద్ధరించాల్సి ఉందని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు అక్టోబరులో ప్రతిపాదనలు పంపారు. ఇందుకు 1,700 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ నిధులు ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ఆర్థిక శాఖ, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినా స్పష్టత రాలేదు. పనులు చేసేందుకు ఇప్పుడే సీజన్‌ అని, త్వరగా వీటిపై నిర్ణయం తీసుకోవాలని ఇంజినీర్లు కోరుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి ఐ-ప్యాక్‌ చెప్పిందే ప్రామాణికంగా రోడ్లను ఎంపిక చేసింది.

Tags

Next Story