PAWAN: కన్నీరు మీ గడప తొక్కనివ్వను... కష్టం దరి చేరనివ్వను

PAWAN: కన్నీరు మీ గడప తొక్కనివ్వను... కష్టం దరి చేరనివ్వను
X
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానని పవన్ ప్రకటన

అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా­లో­ని మా­రు­మూల గి­రి­జన గ్రా­మం­లో పర్య­టిం­చిన ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్ ప్ర­జల సమ­స్య­ల­ను స్వ­యం­గా తె­లు­సు­కు­ని పరి­ష్కా­రా­ని­కి చర్య­లు తీ­సు­కు­న్నా­రు. ప్ర­జా సమ­స్యల పరి­ష్కా­రం కోసం తమ ప్ర­భు­త్వం ని­బ­ద్ధ­త­తో పని­చే­స్తోం­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. గి­రి­జ­నుల కష్టా­లు తనకు తె­లు­స­ని, వారి గడ­ప­కు కన్నీ­రు చే­ర­కుం­డా చూ­డ­టం ప్ర­భు­త్వ బా­ధ్యత అని అన్నా­రు. మా­వో­యి­స్టుల ప్ర­భా­వం ఉన్న ప్రాం­తా­ల­కు రా­వ­డా­ని­కే చాలా మంది రా­జ­కీయ నా­య­కు­లు వె­ను­కా­డ­తా­ర­ని, కానీ ప్ర­జల కోసం ఎక్క­డి­కై­నా వె­ళ్లేం­దు­కు తాను సి­ద్ధం­గా ఉం­టా­న­ని ఆయన తె­లి­పా­రు. శని­వా­రం అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా పా­డే­రు ని­యో­జ­క­వ­ర్గం­లో­ని నం­ది­గ­రు­వు గ్రా­మా­న్ని పవన్ కళ్యా­ణ్ సం­ద­ర్శిం­చా­రు. అక్కడ గి­రి­జ­ను­ల­తో కలి­సి ప్ర­త్యే­కం­గా “మా­టా­మం­తీ” కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా గ్రా­మ­స్తు­ల­తో ఆత్మీ­యం­గా మా­ట్లా­డి వారి సమ­స్య­లు, అవ­స­రా­లు గు­రిం­చి అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. కొం­ద­రు గ్రా­మ­స్తు­లు చె­ప్పిన సమ­స్య­ల­ను అక్క­డి­క­క్క­డే సం­బం­ధిత అధి­కా­రు­ల­తో మా­ట్లా­డి పరి­ష్క­రిం­చేం­దు­కు ఆదే­శా­లు కూడా ఇచ్చా­రు. గి­రి­జన ప్రాం­తా­ల్లో ప్ర­జ­ల­కు అవ­స­ర­మైన మౌ­లిక సదు­పా­యా­ల­ను అం­దిం­చ­డం­పై ప్ర­భు­త్వం ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టిం­ద­ని పవన్ కళ్యా­ణ్ పే­ర్కొ­న్నా­రు.

కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమానంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. నందిగరువు గ్రామంలో సుమారు 40 గడపలు మాత్రమే ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు.

గి­రి­శి­ఖర గ్రా­మా­ల్లో గర్భి­ణీ­లు ఆసు­ప­త్రు­ల­కు చే­రు­కు­నే సమ­యం­లో ఎదు­ర్కొం­టు­న్న ఇబ్బం­దు­లు తనను కల­చి­వే­శా­య­ని ఆయన అన్నా­రు. ఆ పరి­స్థి­తు­ల­ను మా­ర్చేం­దు­కు ఏజె­న్సీ ప్రాం­తా­ల్లో డోలీ మో­త­లు వి­ని­పిం­చ­కుం­డా ఉం­డా­ల­ని సం­క­ల్పిం­చి కేం­ద్ర ప్ర­భు­త్వ సహ­కా­రం­తో రో­డ్ల ని­ర్మా­ణం చే­ప­డు­తు­న్నా­మ­న్నారు. ప్ర­జల కోసం ఎలాం­టి ప్రాం­తా­ని­కై­నా వస్తా­న­ని.. గి­రి­జిన హక్కు­ల­కు భంగం కల­గ­కుం­డా అభి­వృ­ద్ధి చేసి చూ­పి­స్తా­మ­ని పవన్ కళ్యా­ణ్ హామీ ఇచ్చా­రు. కూ­ట­మి సర్కా­రు పీ­పు­ల్స్ ఫ్రెం­డ్లీ ప్ర­భు­త్వ­మ­న్న పవన్ కళ్యా­ణ్.. ప్ర­జల కష్టా­లు వి­న­డా­ని­కి, సమ­స్య­లు తీ­ర్చ­డా­ని­కి, కన్నీ­రు మీ గడప తొ­క్క­కుం­డా చూ­డ­టా­ని­కి తాము ఎల్ల­ప్పు­డూ సి­ద్ధం­గా ఉం­టా­మ­న్నా­రు. గి­రి­జ­నుల కష్టా­ల­ను చూసి రహ­దా­రుల ని­ర్మా­ణా­ని­కి ముం­దు­కొ­చ్చా­మ­ని ఉప­ము­ఖ్య­మం­త్రి పవ­న్‌ కల్యా­ణ్‌ అన్నా­రు. అల్లూ­రి జి­ల్లా నం­ది­గ­రు­వు­లో గి­రి­జ­ను­ల­తో పవ­న్‌ కల్యా­ణ్‌ మా­టా­మం­తీ కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చా­రు. గి­రి­జ­నుల సమ­స్య­ల­ను అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. గత ప్ర­భు­త్వం కనీ­సం సమ­స్య­లు వి­న్న పరి­స్థి­తు­లు కూడా లే­వ­న్నా­రు. సరైన రహ­దా­రి లే­కుం­డా గి­రి­జ­ను­లు ఇబ్బం­ది పడు­తుం­టే చూసి తట్టు­కో­లే­క­పో­యా­న­న్నా­రు. ఎవ­రి­కి ఏ సమ­స్య ఉన్నా.. తనతో పం­చు­కో­వా­ల­ని కో­రా­రు. ప్ర­జల కష్టా­లు తీ­ర్చేం­దు­కే కూ­ట­మి ప్ర­భు­త్వం ఉం­ద­ని భరో­సా ఇచ్చా­రు. అం­గ­న్వా­డీ సెం­ట­ర్‌­ను సం­ద­ర్శిం­చి, అక్క­డి చి­న్నా­రు­ల­తో ము­చ్చ­టిం­చా­రు.

Tags

Next Story