పరుపుల్లో మద్యం బాటిళ్లు.. సరికొత్త దారుల్లో ఏపీకీ తరలించే ప్రయత్నం

పరుపుల్లో మద్యం బాటిళ్లు.. సరికొత్త దారుల్లో ఏపీకీ తరలించే ప్రయత్నం

ఏపీలో మద్యం చెత్త బ్రాండ్ల అమ్మకాలు.. అక్రమ రావాణాకు దారులు తీస్తోంది. దీంతో ప్రతి రోజూ ఏపీలో ఎక్కడో ఒక చోటు అక్రమ మద్యం రావాణా బయటపడుతోంది. మద్యాన్ని అక్రమంగా తరలించే ముఠా సరికొత్త దారుల్లో తరలించే ప్రయత్నం చేస్తోంది.. తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌ పోస్టు దగ్గర తనిఖీల్లో అక్రమ మద్యం గుట్టు రట్టైంది.

ఎక్సైజ్‌ పోలీసుల కన్నుగప్పేందుకు అక్రమ రాయుళ్లు.. మద్యం బాటిళ్లను పరుపుల్లో తెలంగాణ నుంచి తెనాలికి తరలించే ప్రయత్నం చేశారు. టాటా ఏస్ వాహనంలో పరుపుల్లో పెట్టి తరలిస్తున్న 604 మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు..


Tags

Next Story