AP: తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ వర్ష సూచన అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య . చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
దేశ వ్యాప్తంగా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 11 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ, తమిళనాడు, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేదార్ నాథ్, బద్రీనాథ్ రహదారులు కూడా మూతపడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com