Mood of the Nation: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్... టీడీపీదే విజయం..!

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే చానల్ సర్వే వివరాలు వెలువరించింది. తాజా సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీ పొత్తు లేకుండానే పదిహేను లోక్ సభ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని పేర్కొంది. ఈ సర్వేలో కేవలం లోక్ సభ సీట్ల గురించే వివరించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంటుందని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా ఉండబోయేది టీడీపీ మాత్రమేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కుండబద్దలు కొట్టేసింది.
గత వారం ఐ ప్యాక్ చేసిన ఓ సర్వే లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ నేతలు అది ఫేక్ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని అరిచి చెప్పారు. కానీ ఆ సర్వే కూడా వైసీపీ డిక్లైన్ ను క్లియర్‌గా తేల్చేసింది. ఇండియా టుడే ఛానల్ ప్రతి ఆరు నెలలకోసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు చేస్తుంది. అయితే ఈ సర్వేపై ఫేక్ అని చెప్పుకునే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది. ఎందుకంటే ఇదే ఇండియా టుడే.. గత ఏడాది కిందట నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టీడీపీకి కేవలం ఏడు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. అప్పుడు వైసీపీ శ్రేణులు, నాయకత్వం ఆ సర్వేను ఓన్ చేసుకుని ఎన్నికల నాటికి టీడీపీ సీట్లు మరిన్ని తగ్గిపోతాయనీ, పాతికకు పాతిక లోక్ సభ స్థానాలూ తమ ఖాతాలోనే పడతాయని ప్రకటనలు గుప్పించాయి.దీన్ని ప్రాతిపదికగానే సీఎం జగన్ వైనాట్ 175 అంటూ లోక్ సభ స్థానాలలాగే అసెంబ్లీ స్థానాలనూ వంద శాతం గెలుచుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆ వైనాట్ 175 మంత్రాన్నే వల్లె వేస్తూ వస్తున్నారు.
మరోవైపు ఆరు నెలల కిందట ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టీడీపీకి పది లోక్ సభ స్థానాలను ఇచ్చింది. ఇప్పుడు తాజా సర్వేలో ఆ సంఖ్య 15కు పెరిగింది. పొత్తుల ప్రస్తావన లేకుండా నిర్వహించిన సర్వే ఇది. అంటే పొత్తులు లేకుండానే టీడీపీ 25 లోక్ సభ స్థానాలలో 15 గెలుచుకోనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో గ్రామాల్లోనూ వైసీపీ పట్టు జారిపోయిదన్న విషయం క్లారిటీగా కనిపించింది. తమ సిట్టింగ్ పంచాయతీలు, కంచుకోటల్లోనే వైసీపీ ఓడిపోయింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని. ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతోందని సర్వేలు చెపుతున్నాయి.
ఇక సీఎం జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుందని, రాష్ట్రంలో అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయిందని సర్వేల్లో తేలింది. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. రాష్ట్రంలో దిగజారుతున్న జగన్ గ్రాఫ్ ను బట్టి చూస్తే ఎన్నికల నాటికి వైసీపీ కనీసం ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు.
Tags
- telangana election survey 2023
- india today
- telangana elections 2023 survey
- survey on telangana elections 2023
- ap 2024 election survey latest
- india today election updates
- 2023 elections in telangana
- ap 2024 election survey
- president election in india
- india today election results
- election results india today
- live election results india today 2019
- president election in india 2022
- by election survey in ap
- india today survey telangana
- tv5
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com