MLA Roja: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం..

MLA Roja (tv5news.in)

MLA Roja (tv5news.in)

MLA Roja: ఇండిగో విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో రెండు గంటల టెన్షన్‌కు తెరపడింది.

MLA Roja: ఇండిగో విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో రెండు గంటల టెన్షన్‌కు తెరపడింది. సురక్షితంగా బయటపడడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు గంట పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. చివరకు సిబ్బంది విమానాన్ని బెంగుళూరుకు మళ్లించి అక్కడి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.

విమానంలో మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో విమానం డోర్లు తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. అయితే, విమానం బెంగళూరు వచ్చినందుకు గాను అదనపు ఛార్జీలు చెల్లించాలంటూ ఇండిగో సిబ్బంది ప్రయాణికులను డిమాండ్ చేశారు.

అయితే యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికుల మండిపడ్డారు. ఇండిగో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి తిరుపతికి చేరుకునేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం 9.20కి రాజమండ్రి నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఉదయం 10.20కి తిరుపతికి చేరాల్సి ఉంది.

అయితే సాంకేతిక లోపం కారణంగా విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా మధ్యాహ్నం బెంగళూరులో ల్యాండ్‌ అయింది. సాంకేతిక సమస్యా, వాతావరణ సమస్యా చెప్పకపోవడంతో రెండు గంటల పాటు ప్రయాణికులు టెన్షన్‌ అనుభవించారు. సిబ్బంది తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజు.. అదనంగా టికెట్‌కు 5వేలు అడిగారని, ఇండిగోపై కేసువేస్తానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story