Guntur : గుంటూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అవమానం..

Guntur : గుంటూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అవమానం..
Guntur : గుంటూరులో కార్పొరేషన్‌ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి

Guntur : గుంటూరులో కార్పొరేషన్‌ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అవమానం జరిగింది. నిన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని అధికారులు తొలగించారు. మొన్న బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్‌ విగ్రహం కూల్చేశారు. అనుమతులు లేవంటూ కూల్చివేతలు చేపట్టారు.

అటు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని మరుగుదొడ్ల వద్ద పడేసి వెళ్లారు. మున్సిపల్‌ అధికారుల తీరుపై ఎస్పీ బాలసుబ్రమణ్యం కల్చరల్‌ అకాడమి ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టింది. అయితే.. గుంటూరులో ఉన్న ఎన్నో విగ్రహాలకు అనుమతులు లేవని అధికారులు అంటున్నారు.

గొప్ప గాయకుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యానికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని కళాకారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ, ఏపీలోని గుంటూరులో మాత్రమే ఎస్పీ బాలు విగ్రహం ఉందన్నారు. ఒక్క బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని నిలదీస్తున్నారు. విగ్రహం తిరిగి ఏర్పాటు చేసే వరకు పోరాడతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story