విద్యార్థుల భవిష్యత్‌తో AP ఇంటర్‌ బోర్ట్‌ చెలగాటం

విద్యార్థుల భవిష్యత్‌తో AP ఇంటర్‌ బోర్ట్‌ చెలగాటం
అధికారుల నిర్వాకంతో గుంటూరు జిల్లా సిరిపురంలో ఫస్టియర్ ప్రశ్నపత్రాలు తారుమారు అయ్యాయి

విద్యార్థుల భవిష్యత్‌తో ఆటాడుకుంటోంది ఏపీ ఇంటర్‌ బోర్డు. అధికారుల నిర్వాకంతో గుంటూరు జిల్లా సిరిపురంలో ఫస్టియర్ ప్రశ్నపత్రాలు తారుమారు అయ్యాయి. కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షకు బోర్డు సూచించిన సెట్‌ ప్రశ్నపత్రం కాకుండా మరొక సెట్‌తో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు అధికారులు. కొన్ని చోట్ల బోర్డు సూచించిన సెట్‌తో.. మరికొన్ని చోట్ల ఇతర సెట్ ప్రశ్నపత్రాలతో ఎగ్జామ్ నిర్వహించారు.

ప్రశ్నాపత్రాల తారుమారుపై ఇంటర్‌బోర్డు కమిషనర్ వివరణ ఇచ్చారు. కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు రాసిన 150 మంది విద్యార్థులకు సెకండ్‌ సెట్‌కు బదులు.. ఫస్ట్‌ సెట్‌ ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని.. ఇద్దరు సిబ్బందిపై చర్యలకు ఆదేశించామని కమిషనర్ వివరణ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story