West Godavari: యువతులు దుస్తులు మార్చుకుంటున్న గదిలో సెల్ ఫోన్: ఇరిగేషన్ శాఖ ఉద్యోగి పాడుబుద్ది

West Godavari: యువతులు దుస్తులు మార్చుకుంటున్న గదిలో సెల్ ఫోన్: ఇరిగేషన్ శాఖ ఉద్యోగి పాడుబుద్ది
West Godavari: మహిళలు ఎక్కడికి వెళ్లినా రక్షణ లేకుండా పోతోంది. నీచ్ కమీన్ గాళ్ల ఆగడాలకు ప్రతీ నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు.

West Godavari: మహిళలు ఎక్కడికి వెళ్లినా రక్షణ లేకుండా పోతోంది. నీచ్ కమీన్ గాళ్ల ఆగడాలకు ప్రతీ నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు. అధికారులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇలాంటి వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. షాపింగ్ మాల్స్, ట్రైల్ రూమ్స్, సినిమా హాలు ఇలా ఎక్కడ చూసిన ఏదో ఒక చోట.. ఏదో ఒక రకంగా వేదింపులకు గురవుతూనే ఉన్నారు.


అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ ఓ కంత్రీగాని ఆటకట్టించారు కొంత మంది యువతులు. ఆత్రేయపురం మండలం లోల్లలాకులలో ఇరిగేషన్ శాఖ క్వార్టర్స్ లో ఓ ఉద్యోగి కీచక పర్వానికి తెరలేపాడు. యువతులు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు చిత్రీకరించేందుకు గదిలో సెల్ ఫోన్ ఏర్పాటు చేశాడు. అయితే గమనించిన యువతులు సెల్ ఫోన్ తీసుకుని.. అతడికి దేహాశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇక స్థానికంగా ఉండే కొంత మంది యువతీయుకులు వన సమారాధన కోసం లోల్లలాకులకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే యువతులు దుస్తులు మార్చుకునేందుకు సమీపంలో ఉన్న ఇరిగేషన్ శాఖ క్వార్డర్స్ ను ఉపయోగించుకున్నారు. ఇదే అదనుగా భావించిన ఓ ఉద్యోగి యువతులు దుస్తులు మార్చుకునే రూమ్ లో సెల్ ఫోన్ పెట్టాడు. ఇది గమనించని కొంత మంది యువతులు అప్పటికే దుస్తులు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఓ యువతి సెల్ ఫోన్ లో వీడియో రికార్డు అవుతున్నట్లు గుర్తించి షాక్ కు గురయ్యింది. వెంటనే స్నేహితులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇలాంటి ఘటనల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. మహిళలను వేధింపులకు గురి చేసే కంత్రీగాళ్ల ఆటకట్టించేందుకు సిద్ధంగా ఉండాలంటున్నారు. అదే విధంగా బయటకు గానీ, కొత్త ప్రదేశాలకు గానీ వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నిపాటి నిర్లక్ష్యంగా ఉన్న కంత్రీగాల వలకు చిక్కడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story