PSLVC-51 నమూన రాకెట్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు

PSLVC-51 నమూన రాకెట్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు
PSLVC-51.. ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదేనని చెప్పారు.

ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు ఉదయం ప్రయోగించనున్న PSLV C-51 నమూన రాకెట్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు. అర్చకులు.. ఆలయ మర్యాదలతో ఇస్రో చైర్మన్‌ శివన్‌కు స్వాగతం పలికారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు శివన్‌కు అందించి.. రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

అనంతరం శివన్‌ మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటల 24 నిమిషాలకు PSLVC-51ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 18 చిన్న శాటిలైట్లను గగన తలంలోకి తీసుకెళ్లనుంది వెల్లడించారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమన్నారు. ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదేనని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాకెట్‌లను నింగిలోకి ప్రవేశపెడుతామని శివన్ తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story