అంతరిక్షంలోకి దూసుకెళ్లిన GSLV- F12 రాకెట్

తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV- F12 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా NVS-01 అనే నేవిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. శ్రీహరికోట లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. 22వందల 32 కిలోల బరువు ఉండే NVS -01 నేవిగేషన్ ఉపగ్రహాన్ని భూదృవ కక్షలో ప్రవేశపెట్టారు.
ఈ ఉపగ్రహం ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం మొబైల్ ఫోన్ లలో వాడుతున్న GPS తరహాలో నేవిగేషన్ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. దీంతో పాటుగా భూగోళ,సముద్ర మార్గాలలో దారి చూపడానికి వైమానిక ప్రయోజనాల కోసం ఉపయోగ పడుతుంది. వ్యవసాయ రంగానికి, విమానాల సర్వీసులకు, అత్యవసర ప్రయోజనాలకు, సముద్రంలో మత్స్య సంపదను గుర్తించడానికి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రయోజనాల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
51.7 మీటర్లు ఎత్తు, 420 టన్నులు బరువు కలిగిన GSLV- F12 మొత్తం 3 స్టేజిలు ఉంటుంది. రాకెట్ ప్రయోగం జరిగిన అనంతరం 18 నిమిషాల నుండి 19 నిమిషాల మధ్య సమయంలో NVS -01 ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షకు చేర్చారు. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలు అందించే విదంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. గతంలో ప్రయోగించి ఉన్న నేవిగేషన్ ఉపగ్రహాలకన్నా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను ఈ ఉపగ్రహంలో పొందుపరిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com