పేదలకు క్రిస్మస్ కానుకగా ఇళ్లు ఇస్తామని సీఎం ప్రకటించడం సరికాదు : ఎంపీ రఘురామ కృష్ణరాజు

పేదలకు క్రిస్మస్ కానుకగా ఇళ్లు ఇస్తామని సీఎం ప్రకటించడం సరికాదు : ఎంపీ రఘురామ కృష్ణరాజు

రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తే.. త్వరలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందన్నారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కరోనా సమయంలో టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టినపుడు ఏమైందన్నారు. పల్లె ప్రగతి, గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే సీఎం... ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ధనం సమకూర్చుకొని పూర్తిచేయాలన్నారు. పేదలకు క్రిస్మస్ కానుకగా ఇళ్లు ఇస్తామని సీఎం ప్రకటించడం సరికాదన్నారు రఘురామ కృష్ణరాజు. 45 ఏళ్లు వచ్చినవారికి పింఛన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

Tags

Next Story