IT RAIDS: సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన సోదాలు

IT RAIDS: సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన సోదాలు
X
కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు..! 16 చోట్ల ముగిసిన తనిఖీలు

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహించారు. పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. మూడు రోజులుగా 16 చోట్ల 55 ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు, డైరెక్టర్లే లక్ష్యంగా ఈ సోదాలు సాగాయి. ఈ క్రమంలో పుష్ప సినిమాలో సుకుమార్‌కు కూడా షేర్లు ఉన్నట్టు గుర్తించారు. అలానే నెల్లూరు ప్రతాపరెడ్డి ఎన్నారై నిధులను భారీగా గోల్మాల్ చేశారని తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం.

సంక్రాంతి సినిమాలే టార్గెట్

సంక్రాంతి పండుగకు విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను టార్గెట్ గా సోదాలు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు సంబందించిన కలెక్షన్స్ తదితర వ్యవహారంపై ఆ సినిమా నిర్మాతలతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో తనిఖీలు చేసారు. డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో రెండు రోజుల పాటు సోదాలు చేసారు అధికారులు. ఇటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో సంస్థతో పాటు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో, ఆఫీసులోను మూడు రోజులు పాటు ఐటీ దాడులు నిర్వహించింది. మరొక ఫైనాన్సర్ నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరుకు చెందిన ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులుసోదాలు చేసారు.

సుకుమార్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పుష్ప2 దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో సుకుమార్ కు షేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, మాంగో అధినేత రామ్ ఇళ్ళలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఐటీ సోదాలపై స్పందించిన అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌లో మూడో రోజైన గురువారం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాలపై దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. నిర్మాత దిల్‌ రాజు ఇళ్ల పైనే కాదు.. చాలా మంది ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం.. పేరుతో సినిమా తీశాం. ఐటీ అధికారులు కూడా సంక్రాంతికి వస్తున్నామని వచ్చారు. రెండేళ్లకు ఒకసారి ఈ సోదాలు సర్వ సాధారణం. తన ఇళ్లల్లో ఐటీ దాడులు జరగలేదు’ అని అనిల్‌ తెలిపారు.

Tags

Next Story