రామతీర్థం ఘటనలో పోలీసుల పురోగతి?
రామతీర్థం ఆలయ ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

రామతీర్థం ఆలయ ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విశాఖకు చెందిన నిందితులు రెండు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రికల్ రంపంతో విగ్రహాలను ముక్కలు చేసినట్లు భావిస్తున్నారు. నిందితుల్ని ఇవాళ మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అటు ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. కచ్చితంగా రామతీర్థంను సందర్శిస్తామని బీజేపీ ప్రకటించగా, ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ.
Next Story