రైతుల అరెస్టులకు నిరసనగా అమరావతి జేఏసీ జైల్ భరో

కృష్ణాయపాలెం రైతుల అరెస్టులకు నిరసనగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది అమరావతి జేఏసీ. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు తుళ్లూరు శిబిరానికి చేరుకోనున్నారు అన్ని గ్రామాల రైతులు, మహిళలు. అక్కడి నుంచి ర్యాలీగా గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి తరలివెళ్లనున్నారు. ఇక.. జేఏసీ పిలుపునకు టీడీపీ మద్దతు తెలిపింది. దీంతో రాత్రి నుంచే ఆ పార్టీ నాయకుల ముందస్తు హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నేతల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ముందస్తు అరెస్టులతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రైతుల జైల్ భరో కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లో జైల్ భరో నిర్వహించి తీరుతామని రైతులు పేర్కొంటున్నారు.
Next Story