pawan kalyan : ఏపీలో రోడ్లను చూస్తే మాయాబజార్ గుర్తొస్తుంది : పవన్ కళ్యాణ్

pawan kalyan : ఏపీలో రోడ్లను చూస్తే మాయాబజార్ గుర్తొస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన జనసేన మత్స్యారుల అభ్యున్నతి సభలో జగన్ సర్కారు తీరుపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గోతులమయం చేసిందని ధ్వజమెత్తారు. ఒంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనసేన నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. వైసీపీ బెదిరింపులకు జనసేన భయపడేది లేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో హింసిస్తే తెగించి రోడ్డుపై నిలబడతానని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి హెచ్చరించారు.
జీవో 217తో లక్షల మంది మత్స్యకారుల పొట్టపొడుతున్నారంటూ పవన్ కళ్యాణ్.. సభా వేదికపైనా జీవో ప్రతులను చింపి నిరసన తెలిపారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘంచాల్సిందేనని.. జీవో చింపినందుకు తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని చెప్పారు. జనసేనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే.. ప్రభుత్వానికి 217 జీవో ఇచ్చే ధైర్యం ఉండేదా..? అని ప్రశ్నించారు. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ ఎక్స్‌పర్ట్ అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మటన్ కొట్లు, చికెన్ కొట్లు నడపడానికి వైసీపీకి అధికారం ఇవ్వలేదన్న పవన్ కళ్యాణ్.. చట్టాలు పాటించేలా వైసీపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com