మంత్రి కొడాలి నానిపై పవన్ తీవ్ర విమర్శలు!

మంత్రి కొడాలి నానిపై పవన్ తీవ్ర విమర్శలు!
మంత్రి కొడాలి నానిపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. పేకాట క్లబ్ లు మీద ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంపై లేదని మండిపడ్డారు.

మంత్రి కొడాలి నానిపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. పేకాట క్లబ్ లు మీద ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంపై లేదని మండిపడ్డారు. మంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మీరు టీవీ ఛానళ్లు, పేకాట క్లబ్బులు నడుపుతూ రాజకీయం చేయవచ్చు గానీ, తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. నివర్ తుపాన్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడాని కి వెళ్లిన పవన్.. గుడివాడలో ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు.

Tags

Next Story