వైసీపీ నాయకులకు ఐదు వందలిస్తే.. ప్రెసిడెంట్ మెడల్ కూడా ఇచ్చేస్తారు : పవన్

కిరాయి గూండాలతో, బాంబులతో దాడులు చేస్తామంటే భయపడేది లేదని.. తోలు తీస్తామంటూ వైసీపీ నాయకత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మర్యాద ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇక సినిమా టిక్కెట్ల వివాదంపైనా స్పందించారు. తనకు సినిమా టిక్కెట్ల ధరపై అభ్యంతరం లేదని.. కానీ వ్యక్తిగత కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. భారతీ సిమెంట్‌ను ప్రజలుకు ఉచితంగా ఎందుకు పంచరని ధ్వజమెత్తారు.
ఇక జగనన్న పథకాలపై పవన్ కళ్యాణ్... తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బును.. దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టకుండా.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాలను కూడా కేవలం వైసీపీ వాళ్లకు ఇస్తున్నారని... ప్రజలను సమానంగా చూడటం లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
తాను యోగమార్గం నుంచి వచ్చినవాడినని... వైసీపీ నేతల తిట్లు తనకు తగలవన్నారు పవన్ కళ్యాణ్. బలహీనపరచాలని చూస్తే... ఇంకా బలపడతానన్నారు. రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేసే సత్తా తనకు ఉందన్నారు. వైసీపీ నాయకులకు 5 వందలు ఇస్తే.. ప్రెసిడెంట్ మెడల్ కూడా ఇచ్చేస్తారంటూ చురకలు అంటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com