26 Feb 2021 12:30 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / పంచాయతీ ఎన్నికల్లో...

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది : పవన్‌ కల్యాణ్‌

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం మండలం మత్య్సపురిలో ఉద్రిక్తతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది : పవన్‌ కల్యాణ్‌
X

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం మండలం మత్య్సపురిలో ఉద్రిక్తతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన వియజం చూసి వైసీపీ ఓర్వలేకపోతోందంటూ మండిపడ్డారు. అందుకే మత్య్సపురిలో వైసీపీ దాడులు చేస్తోందన్నారు. జనసేన సర్పంచ్, వార్డు అభ్యర్ధులపై, వారి ఇళ్లపై దాడులు చేశారన్నారు. వైసీపీ అభివృద్ధి చేయలేకపోవడంతోనే మత్స్యపురిలో 14కు 12 వార్డులు జనసేన మద్దతుదారులను గెలిచారన్నారు. వైసీపీ దాడులను ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసన్నారు పవన్‌ కల్యాణ్‌.

Next Story