Pawan Kalyan : చెత్తపన్ను చెల్లించకుంటే చెత్త వేసి అవమానిస్తారా:పవన్ కల్యాణ్

Pawan Kalyan : చెత్తపన్ను చెల్లించకుంటే చెత్త వేసి అవమానిస్తారా:పవన్ కల్యాణ్
Pawan Kalyan : కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో పన్నుల వసూలుకు సంబంధించిన ఘటనలపై స్పందించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

Pawan Kalyan : కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో పన్నుల వసూలుకు సంబంధించిన ఘటనలపై స్పందించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తిరగడం ఏం సూచిస్తోందని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.

డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ల మాదిరిగా ప్రభుత్వ ఆలోచన విధానం ఉందని పవన్ మండిపడ్డారు. చెత్త సేకరణకు పన్ను విధించడమే దరిద్రం అనుకుంటే...దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దరిద్రంగా ఉందన్నారు.

కర్నూలులో వ్యాపారులు చెత్తపన్ను చెల్లించలేదని చెత్తను పోసి అవమానిస్తారా అని ప్రశ్నించారు పవన్‌. ఇది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ప్రభుత్వానికి నచ్చడం లేదన్నారు.


Tags

Read MoreRead Less
Next Story