PAWAN: ఆంధ్రప్రదేశ్‌లో భారీ కుంభకోణం

PAWAN: ఆంధ్రప్రదేశ్‌లో భారీ కుంభకోణం
ఇళ్ల నిర్మాణం పేరిట అక్రమాలు... ప్రధాని మోదీకి పవన్‌కల్యాణ్‌ లేఖ

ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని పవన్ లేఖలో పేర్కొన్నారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్... ప్రధానిని కోరారు. భూసేకరణ పేరిట 32 వేల 141 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని పవన్ .. ఆరోపించారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని... పవన్... ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే... వాస్తవాలు తెలుస్తాయని కోరారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. 6 లక్షల 68 వేల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86 వేల 984 మందికే ఇచ్చారని పవన్ ... ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి జగన్ విధానాలతో... వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. ఆ పార్టీ నుంచి జనసేనలో చేరిన MLC వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ అవసాన దశలో ఉందన్నారు. జనసేన పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ‘‘నన్ను ఎవరూ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. నన్ను రెచ్చగొట్టారు.త్వరలోనే వైసీపీని కూడా క్లీన్ చేస్తా’’" అంటూ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీలో ఉన్నంతకాలం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు.

" ఆంధ్రప్రదేశ్‌లో నేను ఒక్క రూపాయి తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నడిపించాను. నా మీద కామెంట్స్ చేసే వెధవలు ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్నాను. పార్టీ కోసం నయవంచన లేకుండా పనిచేశాను. నన్ను ఎవరూ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. నన్ను రెచ్చగొట్టారు.. సోషల్ మీడియా వేదిక నా మీద విమర్శలు చేస్తున్నారు అందుకే ప్రెస్ మీట్ పెట్టాను. వైసీపీ బీసీలను బాగా చూస్తే. మేమంతా ఎందుకు బయటకు వచ్చాం. మంత్రి అమర్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా. నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా. నేను పార్టీ కోసం జీవితం దార పోశాను. అమర్ నాకన్నా వెనక వచ్చి జాకపాట్ కొట్టారు. జగన్ ని బూతులు తిట్టిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. ఏయూ మాజీ వీసీ కార్పొరేటర్ల టికెట్లు డిసైడ్ చేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ పదవులు వేసింది వీసీ ప్రసాద్ రెడ్డి నే. మంత్రుల దగ్గర నుంచి అందరూ వెళ్లి ప్రసాద్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారు. జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారు. నా పొలిటికల్ కెరియర్ ఇలా అవడానికి ఎంవీవీ సత్యనారాయణ కీలకపాత్ర పోషించారు””అని వంశీకృష్ణ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story