JANASENA: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు

JANASENA: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు
X
జనసేన 13వ ఆవిర్భావ సంబరాలు... గిరిజనుల మధ్య జరుపుకోవాలని నిర్ణయం... స్వయంగా పాల్గొననున్న పవన్ కల్యాణ్...నేడు గిరిజన గ్రామంలో జనసేన వేడుకలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­కీ­యా­ల్లో ప్ర­త్యేక స్థా­నం సం­పా­దిం­చు­కు­న్న జన­సేన పా­ర్టీ­కి మా­ర్చి 14 ఒక ప్ర­త్యే­క­మైన రోజు. ఆ రో­జు­నే పా­ర్టీ స్థా­పన జరి­గి­నం­దున ప్ర­తి సం­వ­త్స­రం జన­సేన శ్రే­ణు­లు ఈ రో­జు­ను పం­డు­గ­లా జరు­పు­కుం­టా­యి. అయి­తే ఈసా­రి ఆ వే­డు­కల ని­ర్వ­హ­ణ­లో పా­ర్టీ అధి­నేత, ఏపీ ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్ తీ­సు­కు­న్న ని­ర్ణ­యం ప్ర­త్యేక చర్చ­కు దా­రి­తీ­సిం­ది. సా­ధా­ర­ణం­గా భారీ సభలు, భా­రీ­గా అభి­మా­నుల సమూ­హం­తో ని­ర్వ­హిం­చే ఆవి­ర్భావ ది­నో­త్సవ వే­డు­క­ల­ను ఈసా­రి భి­న్నం­గా జర­పా­ల­ని ఆయన ని­ర్ణ­యిం­చా­రు. గి­రి­జన ప్రాం­తా­ల్లో­ని ప్ర­జల మధ్య ఈ వే­డు­క­ల­ను ని­ర్వ­హి­స్తూ వా­రి­తో మమే­కం కా­వా­ల­ని ని­ర్ణ­యిం­చ­డం రా­జ­కీయ వర్గా­ల్లో ఆస­క్తి రే­కె­త్తి­స్తోం­ది. జన­సేన పా­ర్టీ 13వ ఆవి­ర్భావ ది­నో­త్సవ వే­డు­క­ల­ను ఈసా­రి గి­రి­జన గ్రా­మం­లో ని­ర్వ­హిం­చా­ల­ని పవన్ కళ్యా­ణ్ ని­ర్ణ­యిం­చా­రు. పా­డే­రు ని­యో­జ­క­వ­ర్గం­లో­ని నం­ది­గ­రు­వు అనే గి­రి­జన గ్రా­మా­న్ని ఇం­దు­కో­సం ఎం­పిక చే­శా­రు. పా­ర్టీ శ్రే­ణు­ల­కు ఇచ్చిన పి­లు­పు మే­ర­కు గ్రామ స్థా­యి­లో జరి­గే కా­ర్య­క్ర­మా­ల్లో ఆయన స్వ­యం­గా పా­ల్గొ­న­ను­న్నా­రు. మొ­ద­ట­గా ఓనూ­రు జం­క్ష­న్ వద్ద జన­సేన పా­ర్టీ జెం­డా­ను ఆవి­ష్క­రిం­చి కా­ర్య­క్ర­మా­ల­కు శ్రీ­కా­రం చు­ట్ట­ను­న్నా­రు. సా­ధా­ర­ణం­గా జన­సేన ఆవి­ర్భావ ది­నో­త్సవ వే­డు­క­లు భారీ స్థా­యి­లో జరు­గు­తుం­టా­యి. అయి­తే ఈసా­రి అలాం­టి భారీ సభ­ల­కు బదు­లు­గా గి­రి­జ­ను­ల­తో కలి­సే కా­ర్య­క్ర­మా­న్ని ఎం­చు­కో­వ­డం ఆయన రా­జ­కీయ ధో­ర­ణి­ని మరో­సా­రి ప్ర­తి­బిం­బి­స్తోం­ది.

గిరిజనుల మధ్యే...

జెం­డా ఆవి­ష్క­రణ అనం­త­రం ఏజె­న్సీ ప్రాం­తం­లో జరు­గు­తు­న్న అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­ను పవన్ కళ్యా­ణ్ పరి­శీ­లిం­చ­ను­న్నా­రు. ప్ర­ధా­న­మం­త్రి జన్ జాతి ఆది­వా­సీ న్యాయ మహా అభి­యా­న్ (పీఎం జన్ మన్) పథకం, జా­తీయ గ్రా­మీణ ఉపా­ధి హామీ పథకం ద్వా­రా చే­ప­ట్టిన రో­డ్ల ని­ర్మాణ పను­ల­ను ఆయన ప్ర­త్య­క్షం­గా పరి­శీ­లిం­చ­ను­న్నా­రు. ఈ పథ­కాల ద్వా­రా ఏజె­న్సీ ప్రాం­తం­లో చే­ప­ట్టిన అభి­వృ­ద్ధి పను­లు ఎం­త­వ­ర­కు సక్ర­మం­గా జరు­గు­తు­న్నా­యో తె­లు­సు­కు­నేం­దు­కు స్వ­యం­గా పరి­శీ­లన చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని పవన్ కళ్యాణ్ కాలి నడకన పరిశీలించనున్నారు. అడవిలో నిర్మించిన ఈ రహదారి పనులను ఆయన నడుస్తూ పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలను జనసేన నేతలు తనిఖీ చేయనున్నారు.

ఈ ప్ర­యా­ణం­లో మా­ర్గ­మ­ధ్యం­లో గి­రి­జ­ను­ల­తో మా­ట్లా­డి వారి సమ­స్య­లు, అవ­స­రా­ల­ను తె­లు­సు­కో­ను­న్నా­రు. ప్ర­భు­త్వ పథ­కాల అమ­లు­పై ప్ర­జల అభి­ప్రా­యా­ల­ను కూడా ఆయన తె­లు­సు­కు­నే అవ­కా­శం ఉంది. అనం­త­రం “అడ­వి­త­ల్లి బాట” కా­ర్య­క్ర­మం ద్వా­రా పూ­ర్త­యిన రో­డ్ల­ను ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మం ద్వా­రా గి­రి­జన ప్రాం­తా­ల్లో మౌ­లిక వస­తుల అభి­వృ­ద్ధి­కి ప్ర­భు­త్వం చే­స్తు­న్న కృ­షి­ని ప్ర­జ­ల­కు తె­లి­య­జే­య­డం కూడా లక్ష్యం­గా పె­ట్టు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. నం­ది­గ­రు­వు గ్రా­మా­ని­కి చే­రు­కు­న్న తర్వాత గ్రామ ప్ర­జ­ల­తో ని­ర్వ­హిం­చే “మాటా-మంతీ” కా­ర్య­క్ర­మం­లో పవన్ కళ్యా­ణ్ పా­ల్గొ­న­ను­న్నా­రు. ఈ సమా­వే­శం­లో గి­రి­జ­ను­ల­తో ప్ర­త్య­క్షం­గా మా­ట్లా­డి వారి సమ­స్య­లు, అభ్య­ర్థ­న­ల­ను తె­లు­సు­కు­నే అవ­కా­శం ఉంది.

గిరిజనులతో సహపంక్తి భోజనం

అం­తే­కా­కుం­డా గి­రి­జ­ను­ల­తో కలి­సి సహ­పం­క్తి భో­జ­నం చే­య­ను­న్నా­రు. గ్రామ ప్ర­జ­ల­తో కలి­సి భో­జ­నం చే­య­డం ద్వా­రా వా­రి­తో మరింత సన్ని­హి­తం­గా మమే­కం కా­వా­ల­ని ఆయన భా­వి­స్తు­న్న­ట్లు పా­ర్టీ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. సా­ధా­ర­ణం­గా రా­జ­కీయ నా­య­కు­లు భారీ సభ­ల్లో ప్ర­సం­గా­లు చే­స్తా­రు. అయి­తే పవన్ కళ్యా­ణ్ ఈసా­రి ప్ర­జల మధ్య నే­రు­గా వె­ళ్లి వా­రి­తో మా­ట్లా­డ­టా­న్ని ప్రా­ధా­న్యం­గా తీ­సు­కో­వ­డం ప్ర­త్యే­కం­గా కని­పి­స్తోం­ది. ఇది­లా ఉం­డ­గా, ఈ సం­వ­త్స­రం జన­సేన పా­ర్టీ ఆవి­ర్భావ ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా పి­ఠా­పు­రం­లో ని­ర్వ­హిం­చా­ల­ని ముం­దు­గా ని­ర్ణ­యిం­చిన రా­ష్ట్ర­స్థా­యి వే­డు­క­ల­ను పా­ర్టీ రద్దు చే­సిం­ది. ఎండల తీ­వ్రత దృ­ష్ట్యా పె­ద్ద సభ ని­ర్వ­హిం­చ­డం కష్ట­మ­ని భా­విం­చి ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు పా­ర్టీ వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. గత సం­వ­త్స­రం ఆవి­ర్భావ ది­నో­త్స­వా­న్ని పవన్ కళ్యా­ణ్ తన సొంత ని­యో­జ­క­వ­ర్గ­మైన పి­ఠా­పు­రం­లో ఘనం­గా ని­ర్వ­హిం­చా­రు.

Tags

Next Story