Pawan Kalyan: ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థిక సాయం..

Pawan Kalyan: ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థిక సాయం..
Pawan Kalyan: ఇప్పటం బాధితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Pawan Kalyan: ఇప్పటం బాధితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన వారికి జనసేన తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.


గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో 50కి పైగా ఇళ్లు కూల్చివేసింది జగన్ ప్రభుత్వం. అయితే, జనసేన ప్లీనరీ సభ పెట్టుకునేందుకు స్థలం ఇచ్చామనే కక్షతోనే.. తమ ఇళ్లు కూలగొట్టారని ఆరోపిస్తున్నారు బాధితులు. కావాలనే జనసేన, టీడీపీ మద్దతుదారుల ఇళ్లను కూల్చివేశారని చెబుతున్నారు.


విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. వెంటనే ఇప్పటంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇడుపులపాయ ఎస్టేట్‌ మీదుగా నేషనల్ వైవే వేస్తామన్నారు పవన్ కల్యాణ్.

Tags

Next Story