దుర్గగుడి అమ్మవారి ఆలయమా? లేక వైసీపీ పార్టీ కార్యాలయమా? : పోతిన మహేష్

దుర్గగుడి అమ్మవారి ఆలయమా? లేక వైసీపీ పార్టీ కార్యాలయమా? అంటూ ప్రశ్నించారు జనసేన నేత పోతిన మహేష్. ఆలయ ప్రాంగణంలో రాజకీయ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్నారు. ఈవో సురేష్ బాబు రాజీనామా చేసి వైసీపీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. కరోనా లాక్‌డౌన్ నుంచి నిన్నటి సమావేశం వరకు అమ్మవారి ప్రసాదాలను వైసీపీ నేతలు, కార్పోరేటర్ అభ్యర్ధులకు దోచిపెడుతున్నారంటూ ఆరోపించారు. ఆలయంలో జరుగుతున్న వరుస ఘటనలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు.
Next Story