జగన్ 70 కోట్లు ఇస్తానని ప్రకటించడం నమ్మశక్యంగా లేదు : పోతిన మహేష్

X
By - kasi |22 Oct 2020 3:23 PM IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ప్రాణ నష్టం జరిగితేగానీ ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు. కొండ చరియలు విరిగి
పడిన ఘటన ప్రమాదావశాత్తు జరిగింది కాదని... అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్లనే జరిగిందని మహేష్ ఆరోపించారు. దసరాను రాష్ట్ర ఉత్సవంగా గత ఏడాది ప్రకటించినా... ఇంతవరకు నిర్వహణా ఖర్చులు ఇవ్వలేదన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు ఆలయ అభివృద్ధికి 70 కోట్లు ఇస్తానని ప్రకటించడం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com