JANASENA:జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

పిఠాపురం నియోజవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఈనెల 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదన్నారు. జనసేనలో చాలా మంది పదవులు కోసం ఆశిస్తున్నారని.... పదవులు కోసమే ప్రయాణం చేయకూడదని మనోహర్ సూచించారు. ఆవిర్భావ భారీ సభకు సంబంధించి భూమి పూజ పూర్తయింది.
ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల
జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను జనసేన పీఏసీ ఛైర్మన్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. . ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగాలకు సంబంధించి సూచనలు చేశారు. మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి ప్లీనరీ కావడంతో సభను భారీగా నిర్వహించనున్నారు. పండగ వాతావరణంలో గర్వంగా సభ జరుపుకోవాలి.. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయాలి అని సూచించారు.
ఆకట్టుకున్న పోస్టర్
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రండి.. మార్చి 14న ఉత్సవం జరుపుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం వేదికగా ఈ సభ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దాం
కాకినాడలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలసమావేశాంలో రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రతి కార్యకర్త పాల్గొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com