బీజేపీ చలో అంతర్వేది కార్యక్రమానికి జనసేన మద్దతు
బీజేపీ చలో అంతర్వేది కార్యక్రమానికి జనసేన మద్దతు తెలిపింది.. జనసేన కార్యకర్తలు చలో అంతర్వేది కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో ధర్మపరిరక్షణ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీక్ష ముగిసిన అనంతరం మాట్లాడారు.. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వ నిర్లిప్తత, కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు పవన్ కల్యాణ్. పిఠాపురం ఘటనలోనే అసలు దోషులను పట్టుకుని, కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావన్నారు. మతిస్థిమితం లేని వారి చర్యగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.. అంతర్వేది ఘటనలో పోలీసులు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు పవన్ కల్యాణ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com