స్వగ్రామానికి జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్ధివదేహం

జమ్మూ కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని.. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి తీసుకొచ్చారు సైనికాధికారులు. వీర జవాన్‌కు గ్రామస్థులు క్యాండిల్ ర్యాలీతో జోహార్లు పలికారు. భారత వాయుసేన విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పోలీసులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం ఐరాల మండలంలోని రెడ్డివారిపల్లికు తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Next Story