JC Prabhakar Reddy: పెన్నా నదిలో దూకి చస్తా..!

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దపప్పూరులో జరుగుతున్న ఇసుక దోపిడీపై సాక్ష్యాధారాలతో వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని మండిపడ్డారు. ప్రతి రోజు 20 మందితో 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లు తరలించాలని నిబంధనలు చెప్తున్నా రోజుకు 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుంటే మానిటరింగ్ కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కలెక్టర్ సహా కమిటీలో ఉన్నా 13 మంది ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆధారాలు బయటపెట్టినా స్పందించరా అంటూ ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాపై మూడు రోజుల్లో స్పందించకుంటే పెన్నా నదిలో తనతో పాటు మరో ఇద్దరు దూకి చచ్చేందుకు సిద్ధమని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com