యువగళంతో అధికారంలోకి రావడం ఖాయం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

యువగళంతో అధికారంలోకి రావడం ఖాయం: జేసీ ప్రభాకర్‌రెడ్డి
X
రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్న మండుటెండలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు

యువగళం పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్న మండుటెండలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. కేవలం ఏపీ ప్రజల కోసమే లోకేష్‌ కాళ్లకు బొబ్బలు వచ్చిన వెనక్కి తగ్గడం లేదన్నారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే నినాదంతో ముందుకు కదులుతున్న లోకేష్‌ వెంట ఏపీ ప్రజలంతా ఉన్నారని ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు లోకేష్ వెనక్క తగ్గరని జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. జగన్‌ ప్రజా వ్యతిరేక పాలనకు లోకేష్ చరమగీతం పాడడం ఖాయమన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లోకేష్ తప్పకుడా విజయం సాధిస్తారని స్పష్టం చేశారు

ఇక లోకేష్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి భావోద్వేగం అయ్యారు. లోకేష్‌ను చూస్తే బాధేస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడుతున్న లోకేష్‌.. గొప్ప నాయకుడని కొనియాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Tags

Next Story