జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మోహరింపు

జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మోహరింపు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని బయటకు రానివ్వకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అడిషనల్ ఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి, ఇద్దరు డిఎస్పీలు, ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 500 స్పెషల్ పార్టీ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జేసీ ఇంటివైపు టీడీపీ కార్యకర్తలను, జేసీ అనుచరులను పోలీసులు అనుమతించడం లేదు.

జేసీ నివాసం ఎదురుగా జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విదాస్పదంగా మారింది. ప్రహరీ గోడ నిర్మాణానికి కాంట్రాక్టర్ గోతులు తవ్వారు. అయితే ఆ తవ్విన గోతులను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి పూడ్చివేశారు. అయితే 60 అడుగుల రోడ్డును వదిలి ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపట్టాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. కాగా ప్రహరీగోడ నిర్మాణ కాంట్రాక్టు పనుల సాకుతో జేసీ ఇంటి పరిసరాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Tags

Read MoreRead Less
Next Story