JD Lakshmi Narayana: అనధికార ఫోన్ ట్యాపింగ్ సరికాదు: జేడీ లక్ష్మీనారాయణ

JD Lakshmi Narayana: అనధికార ఫోన్ ట్యాపింగ్ సరికాదు: జేడీ లక్ష్మీనారాయణ
X
కోటంరెడ్డికి అనుమానం ఉంటే హైకోర్టులో రిట్‌ వేసుకోవచ్చు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఐబీ, సీబీఐ, ఎన్‌ఐఏ, ఆర్‌ఏడబ్ల్యూ వంటి సంస్థలకు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారాలు ఉన్నా కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలన్నారు. దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాల్లో మాత్రమే ట్యాపింగ్ చేయాలన్నారు. కానీ ఈ మధ్య రాజకీయ కోణంలో ట్యాపింగ్‌ల జరుగుతున్నట్లు ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. 'కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో విషయంలో ట్యాపింగ్, రికార్డింగ్ అని చెప్పలేమన్నారు. దాన్ని పరిశీలనకు పంపితే క్లారిటీ వస్తుందన్నారు. ఆయనకు అనుమానం ఉంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని లక్ష్మీనారాయణ సూచించారు.

Tags

Next Story