అక్కడి నుంచే ఎన్నికల బరిలో దిగుతా: జేడీ లక్ష్మీనారాయణ

అక్కడి నుంచే ఎన్నికల బరిలో దిగుతా: జేడీ లక్ష్మీనారాయణ
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. తన పోటీకి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ఏవిధమైన సంబంధం లేదన్నారు

సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో దిగేది తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. తన పోటీకి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ఏవిధమైన సంబంధం లేదన్నారు. గతంలో కూడా విశాఖ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. ఏ పార్టీ నుంచి బరిలో దిగేది కూడా క్లారిటీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను బతికించడం, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాలు ఇలా పలు అంశాలపై తన ఆలోచనలతో ఏకభవించిన పార్టీతో కలిసి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ వంద రూపాయలు కాంట్రిబ్యూట్ చేయాలన్న జేడీ లక్ష్మీనారాయణ.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story