JOGI ARREST: వైసీపీ నేత జోగి రమేష్‌కు రిమాండ్

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. జోగి రమేశ్, రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు.
జోగి రమేష్ అరెస్ట్
నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. రమేశ్‌ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని రమేశ్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్‌రావు చెప్పాడు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే అనగా.. 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని జనార్దనరావు తెలిపారని సమాచారం. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే తాను ఆఫ్రికా వెళ్లే ముందు అనగా.. అక్టోబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లినట్లు జనార్దనరావు పోలీసులకు తెలిపారు.
ఉద్రిక్తత
జోగి రమేష్ అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్.. సుమారు 3 గంటల పాటు డోర్ తీయక పోవడంతో అధికారులు ఇంటి బయటనే ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఆయన డోర్ ఒపెన్ చేయడంతో.. ముందుగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే అనగా.. 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని జనార్దనరావు తెలిపారని సమాచారం. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

