JOGI RAMESH: అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేత జోగి రమేష్

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో జరిగిన నకిలీ మద్యం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు వీడియోలో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశానని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. జోగి రమేష్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు . తాను జనార్ధన రావును ఎప్పుడూ కలవలేదని, ఈ వీడియో బలవంతంగా తీయించినదని పేర్కొన్నారు. తర్వాత జనార్దన్ రావుతో.. మాజీ మంత్రి చేసిన వాట్సాప్ చాట్ వైరల్ అయింది. అయితే అది ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాజాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు. జగన్మోహన్ అనే వ్యక్తులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఎప్పుడూ కలవలేదని జోగి రమేష్ చెబుతున్నారని..ఈ ఫోటోలేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేత జోగి రమేష్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. నకిలీ మద్యం కేసులో ఏ-1 నిందితుడు జనార్ధన్‌రావు, ఆయన సోదరుడు జగన్ మోహన్‌రావులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జోగి రమేష్ ఫొటోలు బయటకు వచ్చాయి. మొన్న జనార్ధన్‌రావు వాంగ్మూలం, నిన్న వాట్సాప్ చాట్, నేడు ఫొటోలు .. ఇలా నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌రావు- జోగి రమేష్ మధ్య లింకులు బయటపడుతున్నాయి. జోగి రమేష్ ప్రోద్భలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే జనార్ధన్‌రావు ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే నకిలీ మద్యం చేసినట్టు తెలిపారు. ఏపీలో మద్యం కుంభకోణం పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ మద్యం కేసు మొత్తం జోగి రమేష్ చుట్టూనే తిరుగుతోంది. కూటమి సర్కార్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకే జోగి ఈ మద్యం కుంభకోణం చేశాడని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com