ఏపీ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది: జేపీ నడ్డా

ఏపీ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది: జేపీ నడ్డా
ఏపీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అప్పులు తీసుకొచ్చినా.. వాటిని రాష్ట్ర అభివృద్ధికి కేటాయించకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అప్పులు తీసుకొచ్చినా.. వాటిని రాష్ట్ర అభివృద్ధికి కేటాయించకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట సభలో పాల్గొన్న జేపీ నడ్డా.... వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. రతనాల సీమగా ఉన్న రాయలసీమ రాళ్ల సీమగా మారిపోయిందని అన్నారు.

ఎంతోమంది సీఎంలు రాయలసీమ నుంచి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీ అభివృద్ధిని విస్మరించాయని నిప్పులుచెరిగారు. తిరుమల వంటి పవిత్ర భూమి నుంచే మార్పు కోసం అంకురార్పణ జరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయాలన్నీ ఓ బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని జేపీ నడ్డా అన్నారు. కేంద్రం ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. తిరుపతిలో బీజేపీని గెలిపించడం ద్వారా మోదీ పాలనకు మద్దతుగా నిలవాలని సూచించారు. తద్వారా ఏపీ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపెడతామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story