చంద్రబాబుకు నాకు ఎలాంటి సంబంధం లేదు : జడ్జి రామకృష్ణ

చంద్రబాబుకు నాకు ఎలాంటి సంబంధం లేదు : జడ్జి రామకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు ప్రశ్నించినందుకే తనపై వైసీపీ నేతలు కక్ష గట్టారన్నారు జడ్జి రామకృష్ణ. మూడు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన తనతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై... ఆయన తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని... కావాలనే చంద్రబాబు పేరును వైసీపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మరోసారి ఎమ్మెల్యే అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలుంటాయని జడ్జి రామకృష్ణ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story