Junior NTR : ఆ చర్య వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు : జూనియర్ ఎన్టీఆర్

Junior NTR : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి తన తాత పేరు తీసి వైఎస్‌ఆర్ పేరు పెట్టడంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. ఒకరి పేరు తీసి... మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్‌లు ఇద్దరూ విశేష ప్రజాధరణ పొందిన నేతలన్నారు. వర్సిటీకి పేరు మార్పుతో ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, వారి స్థాయిని..తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నవారి జ్ఞాపకాలను చెరిపివేయలేరంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్
విజయవాడలోని డా.ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును డా. వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది టీడీపీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సీనియర్ ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై తాజాగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం వల్ల ఎన్టీఆర్ స్థాయి తగ్గదంటూ... ట్వీట్‌లో పేర్కొన్నారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com