Justice Prashant Kumar Mishra: ఏపీ హైకోర్డుకు కొత్త జడ్జి..

Justice Prashant Kumar Mishra: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఇవాళ ప్రమాణ స్వీకారం చేసారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం జగన్, స్పీకర్, తదితరులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్‌గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్ర.. అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురుఘసిదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాది వృత్తి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు , మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com