కడప జిల్లా పోలీసుల అదుపులో అంతర్జాతీయ స్మగ్లర్లు

బెంగళూరు కేంద్రంగా స్మగ్లింగ్‌కు తెరలేపిన అంతర్జాతీయ స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం కటిగెనహల్లికి చెందిన ఖలీల్‌ఖాన్, అప్రోజ్‌ఖాన్‌లతో పాటు వీరికి సహకరించిన 27 మంది చోటా స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు ఎస్పీ అన్బురాజన్. వారి వద్ద నుంచి 4 టన్నుల ఎర్రచందనం దుంగలు, కటింగ్ మిషన్, ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసి వీరు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. మాటు వేసి వీరిని పట్టుకున్నట్లు చెప్పారు. బెంగళూరు అడ్డాగా వీరి దందా కొనసాగుతుందన్నారు.
Next Story