Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్‌

Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్‌
11 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్

కాకినాడ సముద్ర జలాల్లో బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంజిన్‌లో మంటలు భారీగా చెలరేగాయి. అందులో వంటకు వాడే గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. రూ.80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బోటు పూర్తిగా దగ్ధమైంది. వారం కిందట సముద్రంలో బోటు వేటకు వెళ్లింది. తుపాను కారణంగా మచిలీపట్నం నుంచి తిరుగు ప్రయాణమైంది. కాకినాడ చేరేందుకు ఇంకా నాలుగు గంటల సమయం ఉండగానే తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.12 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

బంగాళఖాతం, కాకినాడ తీరంలో వేటకు వెళ్తోన్న బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోటులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం బోటులో వంట చేసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే దీని గురించి కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 11 మంది మత్య్సకారులను కాపాడారు. గ్యాస్ సిలిండర్ పేలగానే.. బోటులో ఉన్న వారు సముద్రంలోకి దూకారు. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. బోటు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షక దళం సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటులోని 11 మంది జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు మత్స్యకారులు తెలిపారు. బోటులో మంటలు అంటుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


బంగాళఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదే శాలు జారీ చేశారు. దాంతో సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తే.. రోజుల తరబడి అటే ఉంటారు. అందుకే వారు తమతో పాటు వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్ వంటి వాటిని బోటులో తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో బోటులో ఉన్న సిలిండర్ పేలడంతో ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక కొన్ని రోజుల క్రితమే విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 40కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి.

Tags

Next Story