AP: విజయసాయితో బంధం అట్టగట్టడం భావ్యమేనా...?

మదన్‌మోహన్ మానిపాటి అనే వ్యక్తితో 2016లోనే తాను విడిపోయానని, తర్వాత 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్‌తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరేవారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్‌మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో శాంతి విలేకర్లతో మాట్లాడారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్‌మోహన్ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని శాంతి తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గిరిజన మహిళను కాబట్టే తనను వేధిస్తున్నారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని శాంతి చెప్పారు. తనపై జారీచేసిన అభియోగపత్రంలో 8 ఆరోపణలతో తనకు సంబంధమే లేదని చెప్పారు. 2013లో మదన్‌మోహన్‌తో తనకు వివాహమైందని.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని చెప్పారు. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నానని వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్
ఏపీ దేవాదాయశాఖలో ఇప్పుడు కొత్త లొల్లి తీవ్ర చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతిపై ఆమె భర్తే అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాదు అంతటా వైరల్ అవుతోంది. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు శాంతి భర్త మదన్‌మోహన్ ఫిర్యాదు చేశాడు. తను విదేశాల్లో ఉన్నప్పుడు భార్య గర్బం దాల్చిందని, దీనికి ఇద్దరిపై తనకు అనుమానం ఉందంటూ.. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్‌ల పేర్లను వెల్లడించాడు. ఇటీవలే శాంతిని దేవాదాయ శాఖ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆమె భర్త ఫిర్యాదు సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com