Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.
మార్చి 1 నుంచి 11 వరకు ఆర్జిత సేవలు రద్దు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అవే రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు వేలాదిగ తరలి వస్తారని, కాబట్టి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు

శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5న సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు ఈవో పేర్కొన్నారు.

జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుండి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదం అవుతోంది. మహా శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలమంది భక్తులు నడక దారిలో వస్తుంటారు. అటవీ మార్గంలో 40 కి.మీ. నడిచి శ్రీశైలం చేరుకుంటారు. ఎప్పుడూ లేనిది ఈసారి పర్యావరణ నిర్వహణ ఖర్చుల పేరిట అటవీ అధికారులు భక్తులు ఒక్కొక్కరి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నారు. కన్నడ భక్త బృందం శుక్రవారం కాలినడకన వెళ్తుండగా డబ్బు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో వారు నిరసనకు దిగారు. అడవిలో గంటకు పైగా ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు డబ్బులు చెల్లించారు. అయితే అడవి మార్గంలో పాదచారులు పారేసే ప్లాస్టిక్‌, ఇతర చెత్తను శుభ్రం చేయడానికి సిబ్బంది, కూలీల ఖర్చుల నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డబ్బులు వసూలు చేస్తున్నామని చెబుతున్నారట.

Tags

Read MoreRead Less
Next Story