జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో కీలక పరిణామం

జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో కీలక పరిణామం

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబందించి సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నట్లుగా సాగుతోన్న వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల సుప్రీం కోర్టులో అనుకూల తీర్పు వచ్చిన నేపథ్యంలో.... ఎన్నికలు పెడతామని చెప్పడం.... ఆ మేరకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం అన్నీ.... చకచకా జరిగాయి. కానీ కరోనా పరిస్థితుల్లో పోలింగ్ కష్టతరమని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి కరోనా భయాలున్నాయని, వైరస్ ముప్పు పూర్తిగా తొలిగిపోయిన తర్వాతే ఎన్నికలకు వెళదామని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని.. ఎస్ఈసీకి ఘాటు లేఖ రాయడం, ప్రభుత్వ అసమ్మతి కారణంగా నిమ్మగడ్డ... కలెక్టర్లతో కాన్ఫరెన్సును హుటాహుటిగా రద్దు చేసుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించబోమని వైసీపీకి చెందిన ప్రముఖులు బాహాటంగా చెప్పేశారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది. గతంలో కరోనా దృష్ట్య ఎన్నికలు వాయిదా వేసి..ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగా, ఉత్కంఠగా మారింది.

Tags

Next Story